Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారత్ సూపర్ విక్టరీ

January 31, 2020
న్యూఢిల్లీ, జనవరి 31 (way2newstv.com)
జిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ‘సూపర్’ విజయం సాధించింది. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్ తొలుత టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా.. కివీస్ 13 పరుగులు సాధించింది. 14 పరుగుల టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. లోకేశ్ రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టడంతో 10 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి బంతికి రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీ వరుసగా ఒక డబుల్, ఒక ఫోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 8 వికెట్ల‌కు 165 ప‌రుగులు చేసింది. 
భారత్ సూపర్ విక్టరీ  

మ‌నీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ మొత్తం ఓవర్లు ఆడి 165/7 చేసింది. కొలిన్ మున్రో (47 బంతుల్లో 64, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌. ఈ విజ‌యంతో సిరీస్‌లో భార‌త్ ఆధిక్యం 4-0కు పెరిగింది. ఆఖ‌రిదైన ఐదో టీ20 మాంట్ మాంగానీలో ఆదివారం జ‌రుగుతుంది.ఈమ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో, టిమ్ సీఫెర్ట్ (39 బంతుల్లో 57, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరిద్ద‌రూ చెల‌రేగ‌డంతో కివీస్ టార్గెట్ వైపు ఆడుతూ పాడుతూ దూసుకెళ్లింది. విధ్వంస‌క ఓపెన‌ర్ మార్ట‌న్ గ‌ప్తిల్ (4) విఫ‌ల‌మైనా మున్రో-సీఫెర్ట్ రెండో వికెట్ 74 ప‌రుగులు జోడించారు. ఫిఫ్టీ అనంత‌రం మున్రో ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఈద‌శ‌లో టామ్ బ్రూస్ (0) విఫ‌ల‌మైనా. వెట‌ర‌న్ రాస్ టేల‌ర్ (24)తో క‌లిసి సీఫెర్ట్ జ‌ట్టును విజయం అంచుల వరకు చేర్చాడు. అయితే కీలకదశలో వికెట్లు కోల్పోయిన కివీస్.. మ్యాచ్ ను టైగా ముగించింది.
Read More

ఆర్ధిక సర్వే...

January 31, 2020
8కోట్ల ఉద్యోగాలకు దారి  
న్యూఢిల్లీ, జనవరి 31 (way2newstv.com)
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఎకనమిక్ సర్వే 2020 హైలైట్స్
✺ ప్రపంచ ఎగుమతుల్లో భారత్ తన వాటాను బాగా మెరుగుపరుచుకుంటే 2025 కల్లా 4 కోట్ల ఉద్యోగాలు, 2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చు. ఉద్యోగాల కల్పనకు చైనా అనుసరిస్తున్న విధానాలను ఇండియా ఫాలో అవ్వాలి.
✺ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి, కుటుంబాలు ఖర్చు చేయడం తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించడం, పన్ను వసూళ్లు తగ్గడం అనేవి ఇప్పుడు భారత్ ముందున్న ప్రధాన సవాళ్లు.
ఆర్ధిక సర్వే...

✺ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంత ఈజీ కాదు. దీనికి ప్రో-బిజినెస్ పాలసీ ప్రమోషన్ కచ్చితంగా ఉండాలి.
✺ ప్రభుత్వ రంగ కంపెనీల్లో కేంద్రానికి ఉన్న వాటాలను ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆయా కంపెనీల్లో ప్రభుత్వ వాటా విక్రయాల విషయాన్ని ఈ సంస్థనే చూసుకుంటుంది.
✺ ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. భారత్ ర్యాంక్ 79 స్థానాలు మెరుగుపడింది. 2014లో 142వ స్థానం నుంచి 2019లో 63వ స్థానానికి చేరుకున్నాం.
✺ 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.5 శాతంగా ఉండొచ్చు.
✺ ప్రతి సంవత్సరం అధిక పన్ను ఆదాయ వృద్ధి సాధ్యం కాదు.
✺ ఇన్వెస్ట్‌మెంట్లకు మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
✺ ఆర్థిక వృద్ధిని కోరుకుంటే.. కచ్చితంగా ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవాల్సిందే. ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటమా? లేదా ఆర్థిక వృద్ధా? రెండింటిలో ఏదో ఒకటే సాధ్యమౌతుంది.
✺ 2019-2020 ఆర్థిక వ్యవస్థ పన్ను వసూళ్లు అంచనా వేసిన దాని కన్నా తగ్గొచ్చు.
✺ ఇళ్ల ధరలు పెరిగాయి. దీని వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌షీట్లు ప్రక్షాళన అవుతాయి.
✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 2.5 శాతంగా అంచనా వేశారు.
✺ 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
✺ వ్యవసాయ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 2.8 శాతంగా ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 శాతంగా నమోదు కావొచ్చు.
✺ 2014 నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ.
✺ చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్‌గా అవతరించింది.
✺ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ పథకం కింద 47.33 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది.
✺ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారు.
✺ 2018లో ఏకంగా 1,24,000 కంపెనీల ఏర్పాటు జరిగింది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది.
✺ దేశంలో ఒక హోటల్‌ను ప్రారంభించడం కన్నా ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం సులువని సర్వే పేర్కొంది. ఢిల్లీలో పిస్తోల్‌ కలిగి ఉండేందుకు కావాల్సిన పత్రాల కన్నా హోటెల్‌ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు అవసరమని తెలిపింది
Read More

నీతి వంతమైన పాలనను అందిద్దాం!

January 31, 2020
హైదరాబాద్ జనవరి 31 (way2newstv.com)
మంత్రి కేటిఆర్ ను వేములవాడ మునిసిపల్ చైర్మన్ రామతీర్ధపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, సెస్స్ డైరెక్టర్ రామతీర్ధపు రాజు శుకరవారం మర్యాదపూర్వకంగా కలిసారు.  మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ వేములవాడ పట్టణ, దేవాలయాభివృద్దికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
నీతి వంతమైన పాలనను అందిద్దాం!

ప్రస్తుతం సమ్మక్క సారాలమ్మ సందర్భంగా వస్తున్న లక్షలాదిమంది భక్తులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన మెరుగైన సేవలు అందించాలని కమీషనరును ఆదేశించారు. శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 20, 21 తేదీలలో కోటి రూపాయలతో అద్భుతమైన శివార్చన నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుముకట్టాలని చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రత్యేక సూచనలు చేశారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని తాను, ఎమ్మెల్యే చెన్నమనేనితో కలిసి స్వయంగా త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Read More

ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

January 31, 2020
న్యూ ఢిల్లీ జనవరి 31  (way2newstv.com)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతం ఉంటుందని నివేదిక పేర్కొన్నది.  
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

గత ఏడాది కాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆర్థిక సర్వే నివేదికను తయారు చేస్తారు.  ఇది కేంద్ర బడ్జెట్తో సమానంగా ఉంటుంది.   చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన టీమ్తో కలిసి ఈ నివేదికను తయారు చేశారు.   శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేశారు.  
Read More

ఘనంగా నాగోబా జాతర

January 31, 2020
అదిలాబాద్ జనవరి 31  (way2newstv.com)
ఆదివాసీల అతిపెద్ద జాతరలలో ఒకటైన కేస్లాపూర్ శ్రీ నాగోబా జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.   జాతరకు వచ్చి నాగోభాను దర్శించుకునే భక్తులతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, చేత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్  తదితర రాష్ట్రాల నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మేస్రం వంశీయుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర వేడుకల సందర్భంగా బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్ కు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిదిగా వచ్చారు. అయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు,  ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్,  ఎస్పీ విష్ణు వారియర్, కేస్లాపూర్ సర్పంచ్ రేనూక, జడ్పీటీసీ  పుష్పలత, ఐటీడీఏ చైర్మన్ లక్కీ రావు, పివో ఆదిత్యతో పాటు మేస్రం వంశస్తులు వెంకట్రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. 
ఘనంగా నాగోబా జాతర

జాతరకు వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. తమ సాంప్రదాయాలలో భాగంగా తలపాగా చుట్టి నాగోబా దేవత దర్శనానికి తీసుకెళ్లారు. అటు నాగదేవతను దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మేస్రం వంశస్తులతో మాట్లాడారు. అటు జాతర సందర్భంగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే దర్బార్ లో అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసిల సంస్కృతి, సాంప్రదాయాలను చాటే విధంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.అనంతరం అదివాసిలనుద్దేశించి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ  నాగోబా దేవాలయం నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తానన్నారు. ఇప్పటికే 50 కోట్లు ఇచ్చామని, రానున్న రోజుల్లో మరో 50 కోట్ల కోసం ముఖ్యమంత్రి  కెసిఆర్ కు విన్నవిస్తామని హామీ ఇచ్చారు.  రాజగోపురాలు, గ్రైనేట్, ఆర్చిల నిర్మాణాలతో వెయ్యి సంవత్సరాలు నిలిసిపోయెల ఈ అలయాన్ని నిర్మిస్తామన్నారు. ఆదివాసీల పోడు భూముల జోలికి అతవి శక అధికారులు వెళ్ళారని, పోడుభూములకు హక్కుపత్రాలు తప్పకుండా ఇస్తాని చెప్పారు. అటవీశాఖ అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని, అడవులు అంతరించిపోతే మానవమనుగడనే ప్రశానర్దాకంగా మరుతోందన్నారు.అంతకుముందు ఎంపీ సోయంబాపు రావ్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ఆదివాసిలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఆదివాసీల మీద కేసులు పెడితే ఊరుకోమని, మేము తిరగబడితే ఉద్యోగులు డ్యూటీలు చేయడం కష్టంగా మారుతోందని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలన్నారు. నాగోబా అబివృద్దికి కేస్లాపూర్ లో ఇప్పటికే 11 కోట్లతో వివిధ అబివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అటు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండి భాషాలో మాట్లడుతూ అడివసిలను ఆకట్టుకొన్నారు. అదిలాబాదుకు బదిలీఫై ఇక్కడికి రావడానికి ఏడుస్తూ వచ్చామని.. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుండి వెళ్లాలంటే మరింత ఏడుపు వస్తోందని అన్నారు. ఆదివాసీలతో మమేకమై మూడు సంవత్సరాలుగా ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఆదివాసులు తమ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతు బావిత్రాలకు అందిచేడం చరిత్రలో నిలిసిపోలేల ఉందన్నారు. ముఖ్యంగా చదువు ఫై దృషి సారించాలని చెప్పారు,ఇదిలాఉంటే ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ 2018 నుండి ఇప్పటి వరకు మూడు సార్లు నాగోబా జాతరను నిర్వహించడం జరిగిందని గుర్తు చేసారు.  దీనికి ఆ నాగదేవత దివ్య ఆశీస్సుకే కారణమన్నారు. ఆదివాసీలు ఎప్పుడైనా తమ సమస్యలను విన్నవించేందుకు తమ వద్దకు రావచ్చని సూచించారు.        ప్రదనంగా ఆదివాసి పిల్లలను చదివించి ఉద్యోగం చేసేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు..
Read More